Wednesday, December 3, 2025
E-PAPER
Homeక్రైమ్జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

– కరీంనగర్‌ జిల్లా గన్నేరువరంలో ఘటన
నవ తెలంగాణ-గన్నేరువరం

కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోయిని సాయికుమార్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఆకతాయి పనులు చేస్తున్నాడని ఉపాధ్యాయులు సాయికుమార్‌ తండ్రి చంద్రయ్యను పిలిపించి పరిస్థితిని వివరించారు. ఇంటికి వెళ్తే తండ్రి మందలిస్తాడన్న భయంతో అప్పటికే తెచ్చుకున్న గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఉపాధ్యాయులు గ్రామంలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయుని కారులో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థికి ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -