Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల హాజరు అంతంతే..!

విద్యార్థుల హాజరు అంతంతే..!

- Advertisement -

దసరా సెలవుల తర్వాత బడికి రాని వైనం
నవతెలంగాణ – మల్హర్ రావు

దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ బడులకు విద్యార్థులు రావడం లేదు. హాజరు శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. దాదాపు 15 రోజులపాటు ఆనందంగా గడిపిన విద్యార్థులు బడి ముఖం చూడడానికి ఇష్ట పడడం లేదు. మరో రెండు రోజుల తర్వాత హాజరు పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడమే తక్కువ హాజరుకు కారణమని అంటున్నారు.

మొదటి రోజు శనివారం 33%,రెండోరోజు సోమవారం 60%,మూడవ రోజు మంగళవారం 75 %. విద్యార్థులకు గతనెల 20 నుంచి ఈనెల 3 వరకు 14 రోజులపాటు దసరా సెలవులు ఇచ్చారు. సెలవుల తర్వాత శనివారం పాఠశాలలు పునఃప్రారంభమైయ్యాయి. ఉపాధ్యాయులు బడులకు హాజరు కాగా, విద్యార్థులు హాజరు శాతం తగ్గినట్లుగా మండల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంటుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.రెసి డెన్షియల్ పాఠశాలల్లో హాజరు శాతం మరింత తక్కువగా ఉంది. ఆది సోమవారాల్లో మండలంలో వర్షం కురవడంతో రెసిడెన్షియల్ పాఠశాలలకు విద్యా ర్థులు చేరుకోలేకపోయారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా క్విజ్ , ఆటలు, జనరల్ నాలెడ్జ్, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -