- Advertisement -
నవతెలంగాణ- తాడూర్
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మోలచింతలపల్లి గ్రామానికి చెందిన స్ఫూర్తి (21) నాగర్ కర్నూల్ పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి వసతి గృహం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది పట్టణంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఇక చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
- Advertisement -



