నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి విద్యార్థినికి ఖోఖో నేషనల్ టీం లో అవకాశం రావడం తో స్కూల్ ప్రిన్సిపల్ నాగమణి పిడి సింధుజ లు సంతోషం వ్యక్తం చేశారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి లో గుర్తింపు పొంది ఈరోజు నేషనల్ లెవెల్ లో మా విద్యార్థిని ఖోఖో క్రీడలో పాల్గొనం అభినందనీయమని వారు అన్నారు. గత ఏడాది కల్వకుర్తిలో క్యాంపు ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడలో పాల్గొన్న శ్రీలక్ష్మి రాణి రుద్రమదేవి అవార్డు రావడం జరిగిందని, ఈ అవార్డు రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టగా అది కల్వకుర్తి లో మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న మా విద్యార్థినికి రావడం చాలా గర్వకారణం అని పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి అన్నారు.
విద్యార్థిని శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఈరోజు నేను నేషనల్ లెవెల్ లో ఖోఖో ఆడుతున్నాను అంటే దానికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ నాగమణి, మా పిడి సింధుజాలు ఎంతో ప్రోత్సహించారని ఆమె తెలియజేశారు.
దీనికి మా కుటుంబ సభ్యుల నుంచి మా తండ్రిగారు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్లి ఎలాంటి భయం లేకుండా క్రీడల్లో పాల్గొనాలని, క్రీడలు మనకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయని, క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మనోధైర్యాన్ని ఇస్తాయని మా తండ్రి ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్తారని ముందు జరిగే నేషనల్ గేమ్స్ లో పాల్గొని కల్వకుర్తి ప్రాంతానికి మా పాఠశాల కు మంచి పేరు తెస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఖోఖో ఆర్గనైజర్ గోకమళ్ళ రాజు, పీడీలు పురన్ చంద్, ప్రకాష్, జగన్, తదితరులు పాల్గొన్నారు.



