నవతెలంగాణ-మల్హర్ రావు:మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన రాపల్లి పద్మశ్రీ-కుమార్ దంపతులు కుమారుడు రాపల్లి సాయి హర్షవర్ధన్ అనే విద్యార్థి (ప్రతిభపరీక్ష),(జూనియర్ అథ్లెటిక్స్) పోటీల్లో జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తిరుపతి శుక్రవారం తెలిపారు.భూపాలపల్లి పాఠశాలలో ఈఎల్డీఏ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పరీక్షలో జూనియర్ విభాగంలో హర్షవర్ధన్ ద్వితీయ స్థానంలో నిచినట్లు ఆయన పేర్కొన్నారు.విద్యార్థి ప్రతిభపై సర్పంచ్లు బండారి నర్సింగరావు, బండి స్వామి,మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



