నవతెలంగాణ-పాలకుర్తి
సైబర్ నేరాల పట్ల విద్యార్థినీ, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పాలకుర్తి సీఐ వంగాల జానకి రామ్ రెడ్డి సూచించారు. పోలీస్ అమరుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో సుధా టెక్నో స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై దూలం పవన్ కుమార్ తో కలిసి సిఐ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
విద్యార్థులకు పోలీస్ ఫంక్షన్ గురించి వివరించారు. వైర్లెస్ విధాన కమ్యూనికేషన్, సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, షీ టీమ్, డయల్ 100, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ రూల్స్ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మేకల లింగారెడ్డి, ఎండి యాకూబ్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుళ్లు సోమిరెడ్డి, రవీందర్, సంపత్ కుమార్, కానిస్టేబుళ్లు యాకన్న అశ్విని, ప్రశాంత్, రోహిత్ సుధా స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



