ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
పీఎంశ్రీ కింద టైడ్స్ కు ఎక్స్ పోజర్ విజిట్
ట్రాఫిక్ రూల్స్, వాహనాలు, డ్రైవింగ్ శిక్షణ తదితర అంశాలపై అవగాహన
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రత్యక్ష అనుభవం విద్యార్థులకు భవిష్యత్ జీవితానికి ఎంతో మేలు చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. పీఎంశ్రీ కింద తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవింగ్ స్కిల్స్ (టైడ్స్) కు ఎక్స్ పోజర్ విజిట్ కార్యక్రమాన్ని శుక్రవారం సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 6వ తరగతి విద్యార్థులకు నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు.
ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. ప్రత్యక్ష అనుభవం విద్యార్థులకు జీవితాంతం గుర్తు ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా టైడ్స్ లో వివిధ రకాల వాహనాలు, రెండు, నాలుగు వరుసల రహదారులు, సిమ్యులేటర్ వాహనాలపై లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్, వాహనాల, విడిభాగాల పనితీరు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న తీరును విద్యార్థులు నేరుగా చూసి ఎంతో అనుభూతి చెందారు. తమకు వచ్చిన సందేహాలను టైడ్స్ నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు. పరిశీలనలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, కో ఆర్డినేటర్లు శైలజ, పద్మజ, వెంకన్న, పాఠశాల హెచ్ఎం శారద, టైడ్స్ బాధ్యులు దురై మురుగన్ తదితరులు ఉన్నారు.
ప్రత్యక్ష అనుభవంతో విద్యార్థులకు మేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



