- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గ్రామం నుంచి వివిధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నిజామాబాద్ డిపో బస్సును అడ్డుకున్నారు. ఈ డిపోకు సంబంధించిన బస్సులు సమయపాలన పాటించకుండా రావడంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు బస్సు ఆలస్యంగా వస్తూ ఉండడంతో సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపోతున్నామని వారు ఆరోపించారు. నిజామాబాద్ డిపోకు సంబంధించిన డిపో మేనేజర్ వెంటనే స్పందించి బస్సులో నడిపించాలని వారి డిమాండ్ చేశారు. ఉదయం 9 గంటల లోపు పాఠశాలలకు వెళ్లాల్సిన వారు ఆలస్యంగా పాఠశాలకు వెళ్తున్నామని వారు పేర్కొన్నారు. ఇకనైనా బస్సులను సమయానికి నడిపించాలని వారు కోరారు.
- Advertisement -