నవతెలంగాణ – నెల్లికుదురు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, తహసీల్ధార్ చందా నరేష్, మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎస్. కుమార్ మరియు వైద్యాధికారి డా. చైతన్య లతో సందర్శించి, విద్యా, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. అలాగే మానసిక ఆరోగ్య, క్రీడలు, వ్యాయామం లాంటి తదితర అంశాలు పై కూడా విద్యార్థులకు నిత్యం అవగాహన చేయాలని తెలిపినారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను విద్యార్ధులతో పాటు, సిబ్బంది మొత్తం పాటించాలని, తాజా వేడి వేడి ఆహారం అందించాలని, సకల చర్యలు తీసుకోవాలని, విద్యార్ధుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేయాలని అన్నారు.
అలాగే, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనపడితే వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని, స్వీయచికిత్స చేయరాదని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుమలతతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.



