నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని బమ్మెర ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూరెళ్ళ మల్లారెడ్డి 70 మంది విద్యార్థినీ విద్యార్థులకు 5 వేల విలువ చేసే టై, బెల్టులను బుధవారం బహుకరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహించాలని దృఢ సంకల్పంతో సొంత ఖర్చులతో టై, బెల్టులను బహుకరించానని తెలిపారు. యూనిఫామ్ తో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలను తలపించేలా కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రతి విద్యార్థి యూనిఫామ్ తో టై, బెల్టులు ధరించి పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. క్రమశిక్షణతో పాటు విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామని, పదవ తరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు టై బెల్టులను బహుకరించిన ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డిని విద్యార్థిని, విద్యార్థులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుని కలలను నిజం చేస్తామని విద్యార్థిని, విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామ్మోహన్ రావు , వెంకటేశ్వర్లు, నరసింహస్వామి ,యాకూబ్ పాషా ,స్వామి ,లావణ్య కుమారి, నూర్జహాన్ బేగం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు టై, బెల్టుల బహూకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES