– ఫీజు బకాయిలు, గురుకులాల సమస్యలపై త్వరలో పోరుబాట
– వచ్చేనెల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు
– 29న దీక్ష దివస్‌ను వర్సిటీలు, కాలేజీల్లో నిర్వహించాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాల పై ‘విద్యార్థి రణభేరి’ మోగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, గురుకులాల సమస్యలపై త్వరలో పోరుబాట చేపట్టనున్నట్టు ప్రకటిం చారు. వచ్చేనెల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు నిర్వహించాలని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో విద్యా రంగానికి స్వర్ణయుగం తెచ్చారనీ, గురుకుల విద్యా సంస్థలు, కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని, వైఫల్యాలను విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా ఎండ గట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలని కోరారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29న దీక్ష దివాస్ ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని వివరించారు. ఈనెల 29న దీక్ష దివాస్ అన్ని విశ్వ విద్యాల యాలూ, కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఉద్యమాల నుంచే నాయకులు పడతారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్ధలకే కాదనీ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ అంశంపై విద్యార్థులు, యువతను జాగృతం చేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
అంబానీ సరసన నిలవాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి కోసమే హెచ్‌ఐఎల్‌టీపీ విధానాన్ని తెచ్చారని కేటీఆర్ విమర్శించారు. రూ.ఐదు లక్షల కోట్ల కుంభ కోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. ఈ విధానం ద్వారా ఆయన అంబానీ సరసన నిలవాలని ప్రయత్నం చేస్తు న్నట్టు కనిపిస్తోందనీ, అందుకే అంత భారీ దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలి పారు. 20పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల భూమిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఈ విధానాన్ని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డితోపాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయ త్నంలో భాగంగానే ఈ విధానాన్ని తెచ్చారని తెలిపారు. ఇలా లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఇదే అంశాన్ని జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ కార్పొ రేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే జి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



