Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా

సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలో బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు సోమవారం ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదివారం రాత్రి క్యాంపస్ హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సరైన వైద్య సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ ప్రాంగణంలో అంబులెన్స్ , ప్రహరీ గోడ , పలు సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించమన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన పరిష్కరించలేదని  అంబులెన్స్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రిజిస్టర్ యాదగిరి అక్కడి చేరుకొని విద్యార్థులను సముదాయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు వినతి పత్రం అందజేసి ఆందోళనను విరమించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -