Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కళోత్సవ రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

కళోత్సవ రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలకు చెందిన యస్. చంద్రశేఖర్ (9 వ తరగతి), కే.బాలాజీ(ఇంటర్ ప్రథమ సంవత్సరము)లు కళోత్సవ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారిని ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్, ఆర్ట్ టీచర్ నరహరి ప్రసాద్ లు చెప్పారు. ఈ రోజు ప్రార్థన సమయములో విద్యార్థులను అభినందించారు. సమగ్ర శిక్ష-తెలంగాణ, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రాజు ఆధ్వర్యములో కళోత్సవాలు కామారెడ్డి శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో జరిగాయి.

మ్యూజిక్ సోలో రిథమిక్ ( వ్యక్తిగత మద్దెల సంగీతం)లో యస్ చంద్రశేఖర్  జిల్లాస్థాయి ప్రథమ బహుమతిని, విజువల్ ఆర్ట్స్ 2 డీ సోలో  అను కళలో జిల్లాస్థాయి ప్రథమ బహుమతిని కే.బాలాజీ లు డీఈఓ రాజు చేతులమీదుగా కామారెడ్డిలో అందుకున్నారని చెప్పారు. త్వరలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి కళోత్సవాల పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు. ఈ విద్యార్థులను ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్,ఆర్ట్ టీచర్ నరహరిప్రసాద్, ప్రముఖపద్యకవి డా. బి.వెంకట్, ఉపాధ్యాయులు బచ్చు సుమన్, వేణుగోపాల్, రాము, జే.గణేశ్ ఏ.శైలజ, బి.గంగాప్రసాద్, ప్రవీణ్ కుమార్, దత్తు, సంజు, అశోక్, హనుమాండ్లు, తదితరులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad