Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల ఉత్తమ ఫలితాలను సాధించాలి 

విద్యార్థుల ఉత్తమ ఫలితాలను సాధించాలి 

- Advertisement -

సర్పంచ్ లాకావత్ జిమ్మీ లాల్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలని సర్పంచ్ లాకావత్ జిమ్మీ లాల్ అన్నారు. బుధవారం ఆశ్రమ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు ప్యాడ్ లు జామెంట్రీ బాక్సులు పరీక్షలకు సిద్ధం కావాలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిమ్మిలాల్ మాట్లాడుతూ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి, ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని అన్నారు. మనో నిబ్బరంతో ధైర్యంగా ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధమై వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమంగా రాణించిన విద్యార్థులను కూడా సన్మానిస్తామని పేర్కొన్నారు. 

అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు సర్పంచ్ జిమ్మీ లాల్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ వెంకటేష్ తో పాటు వార్డు సభ్యులు ఉపాధ్యాయులు పిల్లలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -