Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

- Advertisement -

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని
నవతెలంగాణ – వనపర్తి

చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజిని అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడుతూ బాల బాలికలకు జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అని తెలియజేస్తూ విద్యార్థులను ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకొని వాటిని సాధించాలి అని కోరారు.

మరియు విద్యార్థులకు మోటార్ వాహనాల చట్టం గురించి తెలియజేస్తూ 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు నమోదు అవుతాయని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా చైల్డ్ రైట్స్, సేవ్ గర్ల్ చైల్డ్ మరియు పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై ఉపన్యాస పోటీలను, వ్యాసరచన పోటీలు మరియు బొమ్మలు గీయడం వంటి పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. మరియు ఉచిత న్యాయ సలహాల కొరకు NALSA 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమాలలో ప్యానెల్ లాయర్స్ పుష్పలత, శంకర్, ప్రవీణ్ కుమార్, నరేంద్రబాబు మరియు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, ప్రసాద్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -