- Advertisement -
– మండల విద్యాధికారి ఎల్లయ్య
నవతెలంగాణ – కామారెడ్డి
విద్యార్థులకు సృజనాత్మకత విద్యను అందించాలని కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలో వల్ల పాఠశాలకు ప్రార్థన సమయంలో హాజరు అయిన మాట్లాడుతూ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు తదితర సబ్జెక్టులపై పరీక్షలు నిర్వహిస్తూ, విద్యార్థులకు సృజనాత్మకత విద్యను అందించాలని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గోపాలరావు, ఉపాధ్యాయులు కృష్ణారావు, స్రవంతి ,రాజయ్య సి ఆర్ పి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -