నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ / యాదగిరిగుట్ట రూరల్ : మెనూ ప్రకారం మంచి రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్నా భోజనం పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం అందించే భోజనాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి, విద్యార్థులకు భోజనం వడ్డించారు. పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు వచ్చారని, వారందరికీ సరిపోను వంట చేశారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధముగా బోధించి వెనకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులను చదివించి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతం పొందేలా కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి: కలెక్టర్ హనుమంతరావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES