– హెచ్.యం. పి.హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధి దశలో క్రమశిక్షణతో మెలగాలని,సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మన ప్రవర్తనే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల తో సమావేశం నిర్వహించి అనంతరం విద్యార్ధులచే స్వయం పాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. బహుమతుల ప్రధానోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్ధి దశలో నేర్చుకున్న అంశాలే భవిష్యత్తులో ఉపయోగపడతాయని,గురువుల పట్ల గౌరవంగా మెలగాలని అన్నారు. స్వయంపాలన నిర్వహించిన విద్యార్ధులకు వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, వాసవీ క్లబ్ అధ్యక్షులు సత్యవరపు బాలగంగాధర్ వాసవీ క్లబ్ సభ్యులు కంచర్ల రామారావు,కంచర్ల భాస్కరరావు, కుమార్రాజా,కోరుకొండ రాంమోహరావు,పవన్ కుమార్ ,సందీప్ భోగవల్లి రాంబాబు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్ధులు సమాజం పట్ల బాధ్యతగా మెలగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



