Wednesday, August 6, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

- Advertisement -
  • – తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో ఆకస్మిక తనిఖీ
  • నవతెలంగాణ – తంగళ్ళపల్లి
  • విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని తరగతి గదులు, స్టాఫ్ రూమ్, స్టోర్ రూమ్, కిచెన్, లైబ్రరీ, టాయిలెట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబాయాలజీ ల్యాబ్ లను ఫ్యాషన్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ స్టూడియోలను పరిశీలించారు. విద్యార్థులతో విద్యాభ్యాసం గురించి ముచ్చటించారు.హిస్టరీ సబ్జెక్టులో విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు బోధించి.. ప్రశ్నలు అడిగి సమాధానలు రాబాట్టారు.
  • బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేయాలి..
  • విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రం ఆదుకునేందుకు బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు అన్ని సబ్జెక్ట్స్ లపై పట్టు సాధించాలని సూచించారు. పాఠ్యాంశాలపై వచ్చే సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -