- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విమల రెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. శుక్రవారం ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా దుబ్బాక పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. అనంతరం వంద అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించి దేశభక్తిని చాటారు. రన్నింగ్ పోటీల్లో విజేతలైన పలువురు విద్యార్థులకు బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ హామీద్, పీడీ షాదుల్, మానస, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -