Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత రాజ్యాంగ హక్కులను విద్యార్థులు తెలుసుకోవాలి: ఎంపీడీఓ

భారత రాజ్యాంగ హక్కులను విద్యార్థులు తెలుసుకోవాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
భారత రాజ్యాంగం కల్పించిన  ప్రాథమిక హక్కులు, విధుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని మారుమూల గ్రామమైన కోనాపూర్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భారత రాజ్యాంగ  దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ 

ప్రాథమిక హక్కులు, విధులు ఒకదానికొకటి విడదీయరానివని, ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయన్నారు. హక్కులు పౌరుల స్వేచ్ఛ అభివృద్ధికి తోడ్పడితే, విధులు సమాజం పట్ల బాధ్యతను తెలియజేస్తాయని తెలిపారు. పాఠశాల దశలో విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకుంటే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారన్నారు. పౌరులు తమ విధులను  నిర్లక్ష్యం చేస్తే సమాజంలో అరాచకం, అస్తిరత్వం ఏర్పడే ప్రమాదం ఉందనీ, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, గీత, హైమవతి,రాజేశ్వరరీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -