Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలి

విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలి

- Advertisement -

– మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి…
నవతెలంగాణ – రాయపోల్ 

విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలను అలవరచుకోవాలని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి ప్రాథమిక పాఠశాలలో 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలను అలవరచుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి వారికి మెరుగైన భవిష్యత్తు అందించేందుకు సహకరించాలని కోరారు. పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాల భవనం అభివృద్ధి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని పేర్కొన్నారు. అలాగే పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -