- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
మన చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని తద్వారా వ్యాధులు దరి చేరవని ఏఎన్ఎం సంధ్య తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. “జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం” సందర్భంగా సోమవారం దుబ్బాక మండలం గంభీర్ పూర్ లో శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. హెడ్మాస్టర్ ఎండీ.షరీఫ్, ఆశా జింక శోభ, టీచర్లు రాజేందర్, అఖిల, శ్యామల, శ్రీలత, రేఖ ఉన్నారు.
- Advertisement -