Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: డాక్టర్ క్రిస్టినా

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: డాక్టర్ క్రిస్టినా

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పౌష్టికాహారపు తీసుకోవాలని డాక్టర్ క్రిస్టినా సూచించారు. శనివారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల కళాశాల లో ఆరోగ్య శిబిరం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా  వైద్యాధికారిని డాక్టర్ క్రిస్టినా మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడే అది పూర్తిస్థాయి ఆరోగ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఆరోగ్య కార్యకర్త శారద, భానుప్రియ,  ఆశా కార్యకర్తలు బండ ప్రమీల, పాశం జ్యోతి, ప్రియాంక, అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -