విద్యార్థులకు గుర్తింపు కార్డుల పంపిణీ..
నవతెలంగాణ -తంగళ్ళపల్లి
విద్యార్థులు దూరాలవాట్లకు దూరంగా ఉండాలని కురుమ సంఘం మండల అధ్యక్షులు ఎగుర్ల కర్ణాకర్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పూర్వ విద్యార్థులు గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి బాగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుకుంటేనే ఉన్నతమైన శిఖరాలను చేరుకుంటారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. విద్యార్థులు డ్రగ్స్, మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా మంచి లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని ఉద్దేశంతో విద్యార్థులు అందరికీ గుర్తింపు కార్డులను అందించామన్నారు.విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందించిన పూర్వ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో, పరశురాములు, ఇలియాస్, రాజు, అంజి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



