-గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట లక్ష్మి…
నవతెలంగాణ – కాటారం : పాఠశాల దశలో విద్యార్థులు చదువుతోపాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, చరిత్రను అధ్యయనం చేయాలని గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ వెంకట లక్ష్మి అన్నారు. బుధవారం పాఠశాల నందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు, ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ…నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజుగా సెప్టెంబర్ 17 చరిత్రలో మరుపురాని ఘటమని, దీనిలో భాగంగా సెప్టెంబర్ 17న సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగించిన రోజుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES