Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

- Advertisement -

లయన్స్ క్లబ్ సేవాలను సద్వినియోగం చేసుకోవాలి 
చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం అర్రోజు విజయ్ కుమార్ 
నవతెలంగాణ – పెద్దవంగర

విద్యార్థులు నిత్యం ఉన్నత లక్ష్యంతో చదవాలని చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం అర్రోజు విజయ్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణీ తొర్రూరు ఆధ్వర్యంలో చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ఆల్ ఇన్ వన్ లు, ఎన్ఎంఎంఎస్ కు సంబంధించిన మెటీరియల్, స్టేషనరీ, ఫ్యాడ్స్ అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణీ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి తో కలిసి హెచ్ఎం మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణీ వారు ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. వారు మా పాఠశాలకు అందిస్తున్న సేవలు ప్రశంసానీయం అని కొనియాడారు.

త్వరలో వారు పాఠశాలకు రూ. 10 వేల విలువైన మోత్ ఇస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. లయన్స్ క్లబ్ దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సేవా తరుణీ సెక్రెటరీ పద్మావతి, లయన్ ఉమా రెడ్డి, ఉపాధ్యాయులు రమేష్, కోటేశ్వర్, సురేందర్, యాకన్న, ప్రభాకర్, మల్లేశం, కరుణ, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -