Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి: సర్పంచ్ సంతోష్ మేస్త్రీ

విద్యార్థులు సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి: సర్పంచ్ సంతోష్ మేస్త్రీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం సావిత్రి బాయి ఫులే జయంతి వేడుకలను సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రి బాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్నాల్ రమేశ్,  హెచ్ఎం రాజేందర్, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -