- Advertisement -
నవతెలంగాణ -నాగిరెడ్డిపేట్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం రోజు మండల వ్యాప్తంగా పాఠశాలలలో మధ్యాహ్న భోజనాన్ని ఏజెన్సీ నిర్వాహకులు నిలిపివేశారు. విద్యార్థులు ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకొని మధ్యాహ్నం భోజనం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు బుధవారం లంచ్ బాక్స్ తీసుకొచ్చుకోవాలని ఆదేశించడంతో విద్యార్థులందరూ లంచ్ బాక్స్ లు తెచ్చుకొని మధ్యాహ్నం భోజనం చేయడం జరిగింది.
- Advertisement -