Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట్, జేఈఈ ఉచిత శిక్షణను పొందిన విద్యార్థులు

నీట్, జేఈఈ ఉచిత శిక్షణను పొందిన విద్యార్థులు

- Advertisement -

గురుకుల ఇంటర్ విద్యార్థులకు అభినందన
నవతెలంగాణ – మద్నూర్ 

మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర జూనియర్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ అర్సెవార్ సుధాకర్, ఉపన్యాసకులు -డా.బి.వెంకట్ కవి, గంగాప్రసాద్, ప్రవీణ్కుమార్, రాచప్ప, దత్తాత్రేయ, సంజు, పండరి, నాగయ్య, సుమన్ లు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం 2025 నవంబర్ 4వ తేదీ నుండి 2026 జనవరి 4 వ తేదీవరకు రెండు నెలలపాటు భువనగిరియాదాద్రిజిల్లా సర్వేలులోని తెలంగాణ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ ఎంపీసీ టాపర్స్- సగ్గిడి విఘ్నేశ్, చించెల్లి మలంగ్ తేజ, పసుల నిఖిలేష్ లు, జేఈఈ ఇంటెన్సివ్ కోచింగ్ ను తీసుకున్నారు.

అదేవిధంగా ఇదే కళాశాలకు చెందిన‌ బైపిసి ఇంటర్ టాపర్స్ బోయవార్ వినోద్ ,మేకల బాల్ రాజ్, మార్గం సాయికుమార్ లు కీసరగుట్టలోగల తెలంగాణ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో నీట్ ఇంటెన్సివ్ కోచింగ్ ను తీసుకున్నారు.ఈ విద్యార్థులు మద్నూర్ గురుకుల కళాశాలకు బుధవారం వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలను తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సి హెచ్ రమణకుమార్  ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి 35  తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల ఇంటర్ విద్యార్థులకు జేఈఈ ,నీట్ లపై ఉచిత శిక్షణను ఇప్పించారని ప్రిన్సిపాల్ ఏ సుధాకర్ చెప్పారు.

విద్యార్థుల అభిప్రాయంశిక్షణను తీసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ .. మద్నూరు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల నుండి 6 గురికి అవకాశం వచ్చిందని అన్నారు. మా ప్రిన్సిపాల్, ఉపన్యాసకులు,మా తల్లిదండ్రుల చొరవతో మేము సర్వేలుకు, కీసరగుట్టకు వెళ్ళాలమన చెప్పారు. ప్రతి కేంద్రములో 43 మందికి చొప్పున ఈ శిక్షణను అక్కడి సబ్జెక్టు ఎక్స్ఫర్టులు ఇచ్చారు. సర్వేలు ప్రిన్సిపాల్ సతీశ్-గణితమును, ఉపన్యాసకులు- సైదులు ఫిజిక్స్, శ్రీనివాస్ కెమిస్ట్రీలను బోధించారు. జే ఈ ఈ శిక్షణను తీసుకున్న విద్యార్థులు చెప్పారు.

కీసరగుట్ట ప్రిన్సిపాల్ నర్సింహా అన్ని ఏర్పాట్లను చేశారు. అక్కడి ఉపన్యాసకులు-శివమణి-బాటనీ,నరేశ్-జువాలజీ, జనార్దన్ రెడ్డి -ఫిజిక్స్,మొగిలి-కెమిస్ట్రీలను చాలా చక్కగా అర్ధవంతంగా పాఠాలను బోధించారు. పరిశుభ్రమైన వాతావరణములో పాఠాలను విన్నాము. మాకు ఉచితంగా విద్యా,భోజనం, వసతి అన్నీ సమకూర్చారు. జే ఈ ఈ, నీట్ ఉచిత శిక్షణ కార్యక్రమం మాకు చాలా ఉపయోగపడగలదని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -