నవతెలంగాణ – ఆర్మూర్
ఏఐ ద్వారా పాటలు, వాయిస్ తయారు చేసే స్టూడియోను ఈ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ సి ఏ చేతుల మీదుగా బంజారా ఎలక్ట్రానిక్స్ స్టూడియో యందు బుధవారం ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఈ ఆర్ పౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. ఏఐ ద్వారా సర్పంచ్ ల గెలుపు పాట తయారు చేయబడిన వీడియో పాటను యూట్యూబ్లో విడుదల చేయడం జరిగింది. ఈ పాటను సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థులు వాడుకునేటట్టుగా వారు సంబరాలు చేసుకునేటట్టుగా రూపొందించడం జరిగిందని తెలిపారు.
వారు ఆ పాటను యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చని, టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కడికి వెళ్లకుండానే ఒకే గదిలో కూర్చొని ఎవ్వరి అవసరం లేకుండా పాటలు రూపొందించవచ్చు.. సినిమా తీయవచ్చని తెలిపారు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ సేవలను వ్యాపార సముదాయాల వారు, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి, ఇతర కార్యక్రమాల కొరకు బంజారా ఎలక్ట్రానిక్స్ లో సేవను పొందగలరు అని సూచించారు. ఈ కార్యక్రమంలో బంజారా ఎలక్ట్రానిక్స్ యజమాని రజనీష్ కిరాడ్, రాస ఆనంద్ రాంప్రసాద్, పద్మారావు ప్రమోద్ డీలర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.



