- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలను మంగళవారం జిల్లా సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను, వంటగదిని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థుల బోధన పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రత్యేక అధికారిని గరిగే భవాని తదితరులు ఉన్నారు.
- Advertisement -



