– పలువురికి ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత , ప్రముఖ సంఘ సేవకులు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి తన సొంత గ్రామమైన జనగామ గ్రామములో అకస్మాత్తుగా మృతి చెందిన 4 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. 1) గొట్టిముక్కుల బక్కఎల్లవ్వ (వారి కుటుంబానికి పూర్తి ఖర్మ కండలకు,దశ దిన ఖర్మల ఖర్చులూ తానే బరిస్తాను అని డబ్బులు అందజేశారు. 2) కప్పేరా రాజిరెడ్డి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. 3) పాత రాజు కుటుంబాన్ని పరామర్శించారు. 4) పిప్పిరిశెట్టి దేవయ్య కుటుంబాలను పరామర్శించారు. సుభాష్ రెడ్డి తో పాటు కప్పరా రవీందర్ రెడ్డి, మట్ట శ్రీనివాస్, కప్పేరా జీవన్ రెడ్డి, బోధస్ సాయికుమార్, చాట్ల బాబు, కప్పేరా సిద్ధరంరెడ్డి, రవి, నీల స్వామి, పాండరీ, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన సుభాష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES