నవతెలంగాణ – భీంగల్
ఈరోజు భీంగల్ మండలంలో నిజామాబాద్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ ఆధ్వర్యంలో భీంగల్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు రెహమాన్ మాట్లాడుతూ… భీంగల్ పట్టణంలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బస్టాండు పక్కన గల) యందు ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు నష్టపోతున్నారు.
ఈ పాఠశాల యందు స్కూల్ అసిస్టెంట్ హిందీ టీచర్, ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు హిందీ ఉపాధ్యాయుడు లేరు, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, గణితం, సాంఘిక శాస్త్రం యందు ఉర్దూ మీడియం లో బోధించుటకు ఉపాధ్యాయులు లేరు. వీరితోపాటు విద్యార్థులకు కిచెన్ సెంటర్ లేదు. కావున వీటి పట్ల శ్రద్ధ చూపి ఈ ఉపాధ్యాయుల కొరతను తీర్చగలరు. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు భీంగల్ జనరల్ సెక్రెటరీ రాజేష్, హర్ష,నిఖిల్,ప్రకాష్, నందు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



