Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్ఎంపీడీఓకు వినతి పత్రం అందజేత 

ఎంపీడీఓకు వినతి పత్రం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి : ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలను ప్రభుత్వం వెంటనే అందించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షులు కొమ్మెట దేవయ్య అన్నారు. ఈ సందర్బంగా స్థానిక ఎంపీడీఓకు లక్ష్మి నారాయణ ఫీల్డ్ అసిస్టెంట్ లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. పిల్లల చదువులు కూడా కష్టంగా మారాయన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలంటే వాహనాల్లో పెట్రోల్ ఖర్చులు కూడా లేకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మాకు రావలసిన మూడు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన కార్యదర్శి శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -