విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’. పాండిరాజ్ దర్శకుడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటివలే తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఆగస్ట్ 1న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ,’ఈ సినిమా తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకి తెలుగు పాటలు రాంబాబు చాలా చక్కగా రాశారు. వినసొంపుగా ఉన్నాయి. అందరూ రిలేట్ చేసుకునే కథ ఇది. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నేను ఏ క్యారెక్టర్ చేసినా, ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. డైరెక్టర్ ఈ కథని చాలా అద్భుతంగా రాశారు. నిత్యతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది’ అని తెలిపారు.
‘తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అయింది. అందుకే ఈ సినిమాకి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. విజయ్‌తో నేను ఆల్రెడీ ఒక సినిమా కలిసి చేశాను. అదొక డిఫరెంట్ సినిమా. అందులో సైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది (నవ్వుతూ). పాండిరాజ్ అద్భుతమైన డైరెక్టర్. ఈ కథ వినగానే ఓకే చేశాను. ఇది ఒక హీరో, హీరోయిన్స్ సినిమా కాదు ఒక ఫ్యామిలీ లాగా ఉండే సినిమా. ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. ఈ సినిమా కెమెరా వర్క్, మ్యూజిక్ ఫెంటాస్టిక్‌గా ఉంటాయి. తమిళంలో సినిమా చాలా పెద్ద హిట్ అయింది. నెంబర్స్‌తో పాటు అందరి మనసులో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ’ అని హీరోయిన్ నిత్యామీనన్ చెప్పారు.
డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ,’కార్తి నటించిన ‘చిన్న బాబు’ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకి నేనే దర్శకత్వం వహించాను. భార్యాభర్తల మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఇది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విజయ్ సేతుపతి, నిత్య చాలా అద్భుతంగా నటించారు. లవ్, కామెడీ, యాక్షన్, మాస్, ఎమోషన్స్ అన్ని ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ తప్పకుండా ఎంజారు చేస్తారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. పాటలు అద్భుతంగా వచ్చాయి. ఫ్యామిలీ అందరూ హాయిగా ఎంజారు చేసే సినిమా ఇది. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు’ అని లిరిక్ రైటర్ రాంబాబు గోసాల అన్నారు.
తెలుగులోనూ విజయం ఖాయం
- Advertisement -
- Advertisement -