‘గతేడాది ‘క’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు ‘కె-ర్యాంప్’ విజయోత్సవానికి వచ్చాను. డైరెక్టర్ నాని చేసిన కథకు మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం, కిరణ్ లాంటి హీరో ఉండటం..అన్నీ కలిసి ఈ రోజు థియేటర్స్‌లో ప్రేక్షకులు సినిమాను ఎంజారు చేస్తున్నారు. నా సినిమాలు చూసి స్ఫూర్తిపొంది రాజేశ్ దండ ప్రొడ్యూసర్ అయ్యారు. రైట్ కంటెంట్‌ను తీసుకుని ఇన్వాల్వ్ అయి సినిమా నిర్మిస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని ఇస్తారు. ఈ దీపావళి బాక్సాఫీస్ కాంపిటీషన్‌లో ఈ సినిమా నెంబర్ నెం.1 నిలబడింది’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు.
హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘కె-ర్యాంప్’. హౌస్‌ఫుల్ షోస్‌తో పెరుగుతున్న కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు.
ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాతలు దిల్ రాజు, ఎస్‌కేఎన్, డైరెక్టర్స్ శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు.
దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ, ‘టీమ్ ఎఫర్ట్ వల్లే అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగాం. సినిమా బాగుంటే ఏవీ పట్టించుకోము అని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’ అని తెలిపారు.
‘మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఓవర్సీస్‌లో కలెక్షన్స్ తగ్గాయి. గురువారం కిరణ్‌తో యూఎస్ థియేటర్స్ టూర్ వెళ్తున్నాం’ అని నిర్మాత రాజేశ్ దండ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’నా కెరీర్‌లో ఇంతకంటే పెద్ద రావొచ్చు కానీ ఈ సినిమా నా నమ్మకాన్ని నిలబెట్టిన చిత్రవిజయమిది. ప్రతి షో హౌస్‌ఫుల్ అవుతూ వస్తోంది’ అని చెప్పారు.
సరైన కంటెంట్‌తో వస్తే విజయం తథ్యం
- Advertisement -
- Advertisement -