– సంఘీభావం తెలిపిన అఖిల పక్షాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట : రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు అశ్వారావుపేట పట్టణంలో చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బందు కొనసాగ గా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బందు కు సంఘీభావం తెలియజేశారు. పట్టణంలోని మూడు రహదారులు కలిసే ప్రధాన కూడలి నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదం తెలిపి బిల్లును గవర్నర్ కు పంపామని కేంద్రం పెద్దలు స్పందించి రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో బీఆర్ఎస్,కాంగ్రెస్,టీడీపీ, జన సేన,బీజేపీ,సీపీఐ, న్యూడెమోక్రసీ, ఎమ్మార్పీఎస్ పాల్గొన్నాయి.
బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ కురిశెట్టి నాగబాబు నాయుడు, ఉపాధ్యాయుల సూర్య ప్రకాష్ రావు, ఫకీరయ్య, తాళం సూరి, లింగిశెట్టి వెంకటేశ్వరరావు, బుక్కూరు బుచ్చిబాబు, పసుపులేటి రామస్వామి నాయుడు, దండాబత్తులు నరేష్, తాళం ధర్మ, వేముల ప్రతాప్, పణీంద్ర, అంకోలు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.