Saturday, November 15, 2025
E-PAPER
Homeకరీంనగర్జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయవంతమైన పుస్తక ప్రదర్శన

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయవంతమైన పుస్తక ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు యెలగొండ రవి  ప్రారంభించారు. పుస్తక ప్రదర్శనను జిల్లా కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హైస్కూల్ ,జడ్.పి.హెచ్.ఎస్  హై స్కూల్ వెంకంపేట,సరస్వతి హై స్కూల్ ప్రగతి నగర్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు  పాల్గొని పుస్తక ప్రదర్శనను తిలకించి గ్రంథాలయం  సేవలను అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, పుర ప్రముఖులు కూడా  పుస్తక ప్రదర్శనలో  తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఇంచార్జ్ సెక్రటరీ బి శంకరయ్య గ్రంథ పాలకులు కమటం మల్లయ్య, సిహెచ్ మాధవి, కూన  శ్రీనివాస్,  సాయిబాబా మహేష్ రామకృష్ణ, పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -