ఎంబిబిఎస్ విద్యార్థినికి రూ.30 వేల ఆర్థిక సహాయం
నవతెలంగాణ – అచ్చంపేట : నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలోని ఉన్నత చదువులు చదువుతున్న బాలికలకు సుదర్శన్ ఎడ్యుకేషన్ సొసైటీ అండగా నిలుస్తోంది. గత 20 ఏళ్లుగా ఉన్నత చదువులు చదువుతున్న పేద విద్యార్థినిలకు ఆర్థిక సాయం చేస్తూ.. విద్యపైన భరోసా కల్పిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం అమ్రాబాద్ మండలం మాధవన్ పల్లి గ్రామానికి చెందిన సి.అంకిత ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికకు సుదర్శన్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గార్లపాటి సుదర్శన్ నుంచి రూ.30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
అమ్మాయి ఐదేళ్లపాటు ఎంబిబిఎస్ చదువు పూర్తి అయ్యేవరకు ప్రతి ఏడాది రూ.30 వేల చొప్పున సొసైటీ ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థినిలు ఉన్నత చదువులు చదువుతున్న వారికి సొసైటీ ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తు కాలంలో వారు కూడా పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినిలకు భరోసాగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రిన్సిపాల్ రజిత, కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ తదితరులు ఉన్నారు.
పేద విద్యార్థినులకు అండగా సుదర్శన్ ఎడ్యుకేషన్ సొసైటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES