Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమాలోభానికి, త్యాగానికి జరిగే పోరాటం

లోభానికి, త్యాగానికి జరిగే పోరాటం

- Advertisement -

సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హీరో ప్రభాస్‌ ఈ చిత్ర టీజర్‌ను లాంచ్‌ చేశారు. ‘లోభానికి, త్యాగానికి, చీకటికి, దైవత్వానికి మధ్య జరిగే పోరాటాన్ని అద్భుతంగా ఈ టీజర్‌లో ఆవిష్కరించారు. ఆకాశమంత ఆరాధన కలిగించేలా శివుని సాక్షాత్కారం టీజర్‌లో స్పిరిచువల్‌ హైపాయింట్‌. అలాగే విజువల్‌ వండర్‌గా ఉంది. సుధీర్‌ బాబు ప్రజెన్స్‌ డివైన్‌ వైబ్స్‌ కలిగిం చింది. త్యాగంతో పుట్టిన రక్షకుడిగా కనిపించిన పాత్రలో ఆయన లుక్‌ అదిరిపోయింది. సోనాక్షి కలకలం సష్టించే శక్తిగా కనిపించింది. ఈ మైథాలజికల్‌ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ హై ఆక్టేన్‌ స్టోరీటెల్లింగ్‌, మైండ్‌బ్లోయింగ్‌ విజువల్స్‌ అదరగొట్టింది’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. జీ స్టూడియోస్‌, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్‌ చేస్తున్న ఈ సినిమా ను ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌, ప్రెర్ణా అరోరా నిర్మిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img