నారా రోహిత్ హీరోగా నటించిన 20వ చిత్రం ‘సుందరకాండ’.
ఈ సినిమా ఈనెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు.
సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్న పొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు.
తాజాగా హీరో ప్రభాస్ ఈ చిత్ర ర్యాప్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
‘ఓ మిడిల్ ఏజ్ బ్యాచిలర్ తన లైఫ్ పార్ట్‌నర్‌లో ఉండా ల్సిన అయిదు క్వాలిటీస్ కోసం సెర్చ్ చేయడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ జర్నీలో అతని కాలేజీ డేస్ లవ్‌స్టోరీ, ప్రజెంట్ లవ్‌స్టోరీ.. ఇలా రెండు ప్రేమకథలతో హిలేరియస్‌గా సాగుతుంది. ట్రైలర్‌లో ఈ రెండు టైమ్‌లైన్‌ల మధ్య లవ్ టగ్-ఆఫ్-వార్‌ని ఫన్‌గా, మనసుని హత్తుకునే ఎమోషన్‌తో అద్భుతంగా చూపించారు. ర్యాప్ స్టైల్లో కట్ చేసిన ఈ ట్రైలర్ ఫ్రెష్‌గా, సినిమా లైట్-హార్టెడ్ వైబ్‌ని ప్రజెంట్ చేసింది. నారా రోహిత్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఆయనకి తోడు నరేశ్, సత్య, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం స్క్రీన్ మీద ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా పండించారు. డైరెక్టర్ వెంకటేశ్ రాసిన సీన్‌లు క్రిస్ప్‌గా, సిట్యుయేషనల్ కామెడీ, ఎమోషనల్ బీట్స్‌కి స్మార్ట్ బ్యాలెన్స్ చేశాయి. ట్రైలర్ హిలేరియస్‌గా ఉంది. ప్రదీప్ ఎం.వర్మ సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లియాన్ జేమ్స్ మ్యూజిక్‌లో రాప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెషల్ ఫీల్ ఇచ్చింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టాప్ క్యాలిటీలో ఉన్నాయి అని చిత్ర బృందం పేర్కొంది.
వతి వాఘాని, శ్రీ దేవి విజరు కుమార్, నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజరు, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం తదితరులు ముఖ్యతారాగణం.
భిన్న ప్రేమకథల ‘సుందరకాండ’
- Advertisement -
- Advertisement -