Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సుందరయ్య జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శం

సుందరయ్య జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శం

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ : సుందరయ్య జీవితం నేటి యువతరానికి రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈమెరకు సోమవారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్నతనంలోనే 13వ ఏటనే వ్యవస్థలో ఉన్న అంటరానితనం, వివక్షత ఇతర రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఇంటి నుంచి కొనసాగించారని గాంధీజీ పిలుపుమేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన చదువుని మధ్యలోనే ఆపేసారని. ఒక ఉన్నత భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య పోరాటాలను, భూ పోరాటాలను నిర్వహించటంతో పాటు ప్రజలకు తక్కువ ధరలో వైద్యం, నిత్యవసర సరుకులను అందించటం ద్వారా సేవా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించవచ్చు ప్రజలకు మార్గం చూపారని అన్నారు. పార్టీలో చేరి పెట్టుబడుతారు భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా, అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించి పోరాటాలు చేశారని. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భూస్వాములు జాగిర్దారులు జమీందారులు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిర్వహించటంలో నాయకత్వాన్ని వహించి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కంటిరప్పలా కాపాడుకోవడంలో విశేష శ్రద్ధ చూపేవారని. చివరి వరకు తన ఆస్తులను జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసి నిరాడంబర జీవితాన్ని గడిపారని నిత్యం అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషించి చట్టసభల్లో ప్రభుత్వాలను ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారని, ప్రజా ఉద్యమాల కొరకు స్వార్థం ఆవహించకుండా కుటుంబ నియంత్రణను చేసుకొని సమాజమే తన కుటుంబంగా భావించి పోరాటాలు నిర్వహించారని ఆ విధంగా ఆయన నేటితరం యువకులకు, రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శంగా ఆర్గనిర్దేశంకుడిగా ఉంటారని ఆయన అన్నారు. అనంతరం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి సుజాత, కమిటీ సభ్యులు కటారి రాములు, నరసయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శిల్ప లింగం, సిపిఎం కార్యకర్తలు ఉద్ధవ్, శేఖర్ గౌడ్, శంకర్, దినేష్, విశాల్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img