Monday, August 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన నేత సున్నం రాజయ్య

ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన నేత సున్నం రాజయ్య

- Advertisement -

– నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన మహనీయుడు : మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఐదో వర్థంతిలో వ్యకాస, రైతు సంఘం నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆదివాసీ, గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడటంతో పాటు నమ్మిన సిద్ధాంతం కడదాకా నిలిచిన మహనీయుడు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌నాయక్‌ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఐదో వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని ఫారెస్ట్‌ అధికారుల వేధింపులు ఆపాలనీ, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని అటు బయటా, అటు శాసనసభలో రాజయ్య పోరాటం చేశారని గుర్తుచేశారు. ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగితే అక్కడ రాజయ్య ఉండేవారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనీ, పున్నయ్య కమిషన్‌ సాధనతో పాటు అంటరానితనం మీద రాష్ట్రవ్యాప్త పర్యటన చేసేటట్లుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. అసైన్‌మెంట్‌ భూముల పరిరక్షణ కోసం కోనేరు రంగారావు కమిటీని ప్రకటించడంలో రాజయ్యది కీలకపాత్ర అని కొనియాడారు. కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ, ఏ.నరసింహులు, లంక రాఘవులు , ఆలిండియా కౌన్సిల్‌ సభ్యులు సరోజ, రాష్ట్ర నాయకులు కడియాల మోహన్‌, నరసింహ, బంధం శ్రీను, నాగేశ్వరరావు, స్వరాజ్యం, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -