Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులకు అండ భవిత..!

దివ్యాంగులకు అండ భవిత..!

- Advertisement -

అందంగా ముస్తాబైన పెద్దవూర భవిత కేంద్రం
– భవిత కేంద్రంలో అన్ని రకాల వసతులు
నవతెలంగాణ – పెద్దవూర
ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగు లైన పిల్లలకు అండగా ఉన్న భవిత కేంద్రం అందంగా ముస్తాబైంది.లో అన్ని రకాల వసతులు కల్పించారు. భవిత కేంద్రంను 2,00,000 రూపాయలతో ఆధునీకరించారు. భవిత కేంద్రంలోని బాలబాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటివి వాటిలో చక్కగా శిక్షణ అందిస్తున్నారు.ఐఈఆర్పీ తాళ్ళ రమేష్.ప్రత్యేక అవసరాల బాల బాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటివి వాటిలో శిక్షణ అందించి ఇతర పిల్లలతో సమానంగా విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫిజియోథెరఫీ,స్పీచ్ థెరపీ కి సంబందించిన పరికరాలు త్వరలో ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.విద్యార్థులకు మౌలిక సదుపాయాలైన ర్యాంప్, టాయిలెట్స్, రైలింగ్, తాగునీరు వంటి కనీస వసతులు ఏర్పాటు చేశారు.

-దివ్యాంగులకు భరోసా..

దివ్యాంగులైన పిల్లలకు చికిత్స, సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగుల భవిష్యత్తుకు భరోసా కల్పించబడుతుంది. దివ్యాంగ పిల్లలకు అవసరమైన వైద్య చికిత్సలు, సహాయక ఉపకరణాలు అందించడం, సమాజంలో ఇతర వ్యక్తులతో సమానంగా చూసేలా, వారికి మనోధైర్యం కల్పించడం,దివ్యాంగులకు వివిధ నైపుణ్యాల శిక్షణను అందించడం, తద్వారా వారు స్వయం సమృద్ధి సాధించేలా చూడటం,అవసరమైన దివ్యాంగులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయడం వంటివి చేస్తారు.దివ్యాంగ పిల్లలతో పనిచేసే ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణను అందించడం,భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన సమావేశాలను, కార్యక్రమాలు  నిర్వహిస్టారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -