మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మద్నూర్, చిన్న షక్కర్గా, హెచ్ కేలూర్, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మద్నూర్ లో ఉషా సంతోష్ మేస్త్రి, చిన్న షక్కర్గా లో పాండురంగ పాటిల్, హెచ్ కెలూరులో జి లక్ష్మణ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరికి మాత్రమే ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గెలుపు కోసం ప్రచారం చేయాలని సూచించారు.
ఈ మూడు గ్రామాల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మద్నూర్ లో హనుమాన్లు స్వామి, చిన్న షక్కర్గా లో దిగంబర్, హెచ్ కెలూరులో పండరి, పోటీ చేస్తున్న వారికి ఎలాంటి మద్దతు ఇవ్వరాదని ఉద్భోదించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ ,మద్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బండి గోపి, కర్ల సాయిలు, పాల్గొన్నారు.



