తహశీల్దార్ కు ఎమ్మార్పీఎస్ నాయకుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రమైన తాడిచర్ల తహశీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మార్సీస్ మండల అధ్యక్షుడు కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ముట్టడించి, అనంతరం తహశీల్దార్ రవికుమార్ వినపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టివలో ఇచ్చిన హామీలను వృద్ధులకు రూ.2వేల నుంచి రూ.4వేలు,వితంతువులకు రూ.2 వేల నుంచి రూ.4వేలు,వికలాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, వికలాంగుల సంఘం నాయకులు,ఆసరా పింఛన్ దారులు పాల్గొన్నారు.
ఆసరా పింఛన్లు పెంచాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES