ప్రొఫెసర్ డస్టిన్ టింగ్లేతో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ విజన్‌కు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ సహకారాన్ని కోరారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నెడీ స్కూల్‌లో తరగతులకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సంగతి తెలిసిందే. తరగతుల విరామ సమయంలో రేవంత్ రెడ్డి హార్వర్డ్ ఎక్స్ వైస్-ప్రోవోస్ట్, హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టింగ్లే, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరెమీ వైన్‌స్టీన్‌లను కలిశారు. వారికి తెలంగాణ రైజింగ్ విజన్ పై ప్రజంటేషన్ ఇచ్చారు. దాన్ని సాధించేందుకు కెన్నెడీ స్కూల్ సహకరించాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించినట్టు సీఎంఓ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో నాణ్యమైన విద్యాభివృద్ధి, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధితో ఆర్థిక వృద్ధిపై పడే ప్రభావాలపై చర్చించారు.
తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



