న్యూఢిల్లీ : కరూర్ తొక్కిసలాట బాధితుడు ఎస్. ప్రభాకరన్ బంధువులను సిబిఐని సంప్రదించాల్సిందిగా సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేసుకోవాలని జస్టిస్ జె.కె. మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సిబిఐకి అప్పగించాలని, కేసును సిబిఐ పరిశీలిస్తుందని జస్టిస్ మహేశ్వరి ఎస్.ప్రభాకరన్ తరపునహాజరైన న్యాయవాది శ్రీనివాసన్‌కు సూచించింది. తమిళనాడు పోలీస్ అధికారులు, రాజకీయ కార్యదర్శులు సుప్రీంకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకోవాలని బాధితులను ఒత్తిడి చేస్తున్నారని ఆయన అత్యవసరంగా మౌఖికంగా ప్రస్తావించారు. 
ఈ విషాద ఘటనలో తన సోదరి, వివాహం చేసుకోనున్న యువతి.. ఇద్దరినీ కోల్పోయానని ప్రభాకరన్ అన్నారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. ఎటువంటి కారణం లేకుండానే పోలీసులు లాఠీచార్జ్ చేశారని అన్నారు. గందరగోళం సృష్టించడానికి వస్తువులను విసిరిన వారిలో సామాజిక వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును డిసెంబర్ 12కి జాబితా చేసింది.
ఉమర్ ఖలీద్, ఇతరుల బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్ అఫిడవిట్
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో జెఎన్‌యు మాజీ స్కాలర్ ఉమర్ ఖలీద్ సహా పలువురి బెయిల్ దరఖాస్తులకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లను సృష్టించడంలో వారి అంతర్గత, దీర్ఘకాలిక, తీవ్రమైన పాత్ర ఉన్నట్లు నిర్థారించే ప్రత్యక్ష మరియు స్థిరమైన డాక్యుమెంటరీతో పాటు సాంకేతిక ఆధారాలు కూడా పిటిషనర్లపై ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం వాదించింది. దేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను దెబ్బతీసేందుకు, ప్రజలను పురికొల్పడం మాత్రమే కాకుండా, సాయుధ తిరుగుబాటుకు వారిని రెచ్చగొట్టేందుకు ఖలీద్ కుట్ర పన్నాడని, బోధించాడని, అమలు చేశాడని అఫిడవిట్‌లో ఆరోపించింది.
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో జెఎన్‌యు మాజీ స్కాలర్ ఉమర్ ఖలీద్, కార్యకర్త షార్జిల్ ఇమామ్, మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మంగళవారం అక్టోబర్ 31కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపుసొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి అదనపు సమయం కోరడంతో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎస్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.
సిబిఐని ఆశ్రయించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -

 
                                    