నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ దేశ రాజధానిలో తీవ్ర అనారోగ్యానికి గురిచేసేలా గాలి నాణ్యతలు నమోదవుతున్నాయి. గాలి కాలుష్యంపై నమోదైన పిటిషన్‌ను డిసెంబర్ 17న విచారణ జాబితాలో చేర్చనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. గాలి కాలుష్య నివారణ చర్యలు అమలులో ఉన్నప్పటికీ, అధికారులు వాటిని సరిగ్గా అమలు చేయకపోవడమే ప్రధాన సమస్య అని సీనియర్ న్యాయవాది అప్రజిత సింగ్ చేసిన వాదనల్ని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోరుమల్య బాగ్చి, విపుల్ ఎం పాంచోలిలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశించే వరకు.. ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్‌లను అధికారులు పాటించరని న్యాయవాది అప్రజిత సింగ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈ పిటిషన్ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వస్తుంది అని సిజెఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బహిరంగ క్రీడా కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పాఠశాలలు వాటిని నిర్వహిస్తున్నాయని, దీంతో పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుందని మరో న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఢిల్లీ కాలుష్యంపై ఈనెల 17న సుప్రీం విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



